15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు

02-02-2026 12:20 AM

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్

కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రెసిడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్లకు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు సంపత్, అమరేంధర్ లు 11న జరగబోయే పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధుల పట్ల వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పిఓలు, ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రతి విషయాన్ని క్లుప్తంగా పరిశీలించాలన్నారు. మొదటగా పోలింగ్ అధికారి ప్రతి ఓటర్ ను ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఓరిజినల్ గుర్తింపు కార్డుతో మాత్రమే ఓటుకు అనుమతించాలన్నారు.

ఏజెట్ల అనుమతితోనే ఓటు వేయడానికి ఓటర్ ను అనుమతించాలన్నారు. ఓటర్ కు ఇంకు అప్లై చేసిన తర్వాతే బ్యాలెట్ పేపర్ ను ప్రొసిజర్ ప్రకారం మడిచి ఇచ్చి ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఇబ్బందులు రాకుండా పివోలు, ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీస్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసీ ఖాధర్ మొహియుద్దీన్, మాస్టర్ ట్రైనర్లు అమరేంధర్, సంపత్, పోలింగ్ అధికారులు పాల్గొన్నారు.