07-10-2025 09:49:35 AM
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల(RTC fare hike) పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ ఆందోళన చేపట్టింది. మంగళవారం నాడు ఆర్టీసీ బస్సు ఎక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినట్టే ఇచ్చి పురుషుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
చార్జీల భారం ప్రయాణికులపై ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్(Nampally Exhibition Ground) నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ నిరసన తెలిపారు. చార్జీల పెంపుపై ప్రయాణికులు తమ నిరసన వ్యక్తం చేశారు. పేదలపై నెలకు ఐదు వందల రూపాయల దాకా అదనపు భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణికులు నినాదాలు చేశారు.