calender_icon.png 7 October, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్ కీలక చర్చలు

07-10-2025 09:23:43 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాబితాపై మంగళవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) ఉప ఎన్నికపై చర్చలు జరపనున్నారు. సీఎంతో చర్చల అనంతరం జాబితాను ఏఐసీసీకి పంపిస్తామని మహేష్ కుమార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను జాతీయ ఎన్నికల సంఘం అధికారికంగా నిన్న విడుదల చేసింది. ఉప ఎన్నిక కోసం ముగ్గురు ఇన్‌చార్జ్ మంత్రులు సమర్పించిన నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారని మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్‌ను బీసీ అభ్యర్థికి కేటాయించే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు సూచించారు, అయితే దీనిపై అధికారిక ప్రకటన రాబోయే రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందన్నారు.

 ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విలేకరులతో అనధికారికంగా మాట్లాడిన ఆయన, టికెట్ కోసం ముగ్గురు బీసీ అభ్యర్థులు బలమైన పోటీలో ఉన్నారని తెలిపారు.మరోవైపు, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ రేసులో లేరని, గవర్నర్ కోటా కింద శాసన మండలికి నామినేట్ అయ్యే అవకాశం ఉందని టీపీసీసీ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టికెట్ కోసం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా జూబ్లీహిల్స్ టికెట్ పై కన్నేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకముందే ప్రధాన కూడళ్లలో బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనిమిచ్చాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ షేక్ పేటలో ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు, నవీన్ యాదవ్ విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ అందజేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. నేటి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం అభ్యర్థి ఫైనల్ కానున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి వస్తుందో అన్న ఆసక్తి అందరి మదిలో మెదులుతోంది.