calender_icon.png 10 December, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి ఎమ్మెల్యే ఇంట్లో మంత్రులు జూపల్లి, అడ్లూరి సందడి

07-10-2025 10:57:31 AM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఇంట్లో మంగళవారం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు(Ministers Jupally Krishna Rao), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ఎమ్మెల్యే తో కాసేపు సందడి చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంలో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు నివాసానికి చేరుకున్న రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేరుకున్నారు. మంత్రులకు ఎమ్మెల్యే విజయరమణ రావు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి, స్థానిక సంస్థల ఎన్నికలపై పలు అంశాలపై మంత్రులతో ఎమ్మెల్యే చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.