calender_icon.png 7 October, 2025 | 12:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిమ్‌లో వ్యాపారవేత్తపై కాల్పులు.. స్పాట్ డెడ్

07-10-2025 11:15:33 AM

జైపూర్: రాజస్థాన్‌లోని కుచమన్‌లోని జిమ్‌లో మంగళవారం ఉదయం వ్యాయామం చేస్తున్న ఒక వ్యాపారవేత్తను(Bike showroom owner) కాల్చి చంపిన సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తిస్తోందని పోలీసులు వెల్లడించారు. కుచమన్‌లోని స్టేషన్ రోడ్‌లోని జిమ్‌లో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. నగరంలో బైక్ షోరూమ్, హోటల్ యజమాని అయిన 40 ఏళ్ల రమేష్ రులానియాపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. 

దాడి చేసిన వ్యక్తి ఉదయం 5.20 గంటల ప్రాంతంలో జిమ్‌లోకి(GYM) ప్రవేశించి, రులానియాపై అతి దగ్గరగా కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పులకు కొన్ని క్షణాల ముందు నిందితుడు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని ఏఎస్పీ నేమి చంద్ ఖరియా తెలిపారు. స్థానికుల సమాచారంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.