calender_icon.png 7 October, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 టన్నుల ఎర్రచందనం స్వాధీనం: ఇద్దరు అరెస్ట్

07-10-2025 11:06:45 AM

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) తిరుపతి నుంచి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 10 టన్నుల ఎర్రచందనం(Red sandalwood smuggled) దుంగలను ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Special Task Force) స్వాధీనం చేసుకుని, ఇద్దరు అనుమానిత స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. ఆగ్నేయ జిల్లాకు చెందిన ఎస్‌టిఎఫ్ బృందం ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రికవరీపై ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం జరగనుందని అధికారులు పేర్కొన్నారు.