07-10-2025 10:09:37 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు(Jubilee Hills by-election) ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవీన్ యాదవ్‌పై(Naveen Yadav) క్రిమినల్ కేసు(Criminal case) నమోదైంది. ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని నవీన్ యాదవ్ పై కేసు బుక్ అయింది. జూబ్లీహిల్స్ పరిధిలో నవీన్ యాదవ్ ఓటరు కార్డులు పంపిణీ చేశారంటూ మధురానగర్ పోలీసులకు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్ పై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను జాతీయ ఎన్నికల సంఘం(Election Commission of India) అధికారికంగా నిన్న విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు, ఫలితం నవంబర్ 14న జరుగుతుంది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.