07-10-2025 10:54:00 AM
దౌల్తాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయైపై జరిగిన దాడిని టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి(TPCC Social Media State Secretary) గణేష్ పంచమి ఖండించారు. ఈ సంఘటన దేశ న్యాయవ్యవస్థ గౌరవాన్ని అవమానపరచే దుష్ట చర్యగా అభివర్ణించారు.రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిన పత్రమని, ఆ రాజ్యాంగాన్ని కాపాడే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం దురదృష్టకర మన్నారు. న్యాయవ్యవస్థపై దాడి అనేది ప్రజాస్వామ్య పునాదులపై దాడితో సమానమన్నారు.
దేశానికి మార్గదర్శకులైన న్యాయమూర్తుల భద్రతకు భంగం కలిగించడం అసహ్యకరమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. దేశ గౌరవం,న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతినేలా చేసే ప్రయత్నాలను కఠినంగా అణచివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యం బలహీనపడకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ శక్తి,సమానత్వం,స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు.ఆ విలువలను చెరిపి వేయాలనే ప్రయత్నాలను అనుమతించొద్దన్నారు.