15 July, 2026 | 1:51 PM

Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •  

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

22-08-2024 02:43 PM

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తిహార్ జైలులో గురువారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు కవితను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. కవితకు గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్ వచ్చినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. కవిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని వారాల క్రితం వైరల్ ఫీవర్, బ్లడ్-షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులతో బాధపడుతూ పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 160 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు ఇటీవల ఆమె కస్టడీని సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ ఆగస్టు 27 న విచారణకు పోస్ట్ చేయబడింది.