calender_icon.png 18 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తుండ్రు: ఎమ్మెల్సీ కవిత

18-03-2025 10:43:22 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ప్రారంభం నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రతి రోజు వినూత్న రీతిలో నిరసన చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి 15 నెలలైనా హామీలు అమలు ఊసేలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha Kalvakuntla ) ప్రశ్నించారు. తులంగా బంగారం ఇవ్వబోమని శాసన మండలి సాక్షిగా చెప్పారని కవిత వెల్లడించారు. ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది?.. ఎప్పుడు ఇస్తారంటూ శాసన మండలి ఆవరణలో కాంగ్రెస్ సర్కార్ పై నిరసన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలిపారు.