11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

కవితతో బీఆర్‌ఎస్ ఎంపీ దామోదర్‌రావు భేటీ

27-05-2025 12:00 AM

పలు అంశాలపై 2 గంటలపాటు చర్చ

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు, పార్టీ లీగల్ సెల్ ఇన్‌చార్జి గండ్ర మోహన్‌రావు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి దాదాపు సుమారు ౨ గంటలకు పైగా చర్చించినట్టు సమాచారం.

లేఖ అనంతర పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులను చక్కదిద్దేలా చర్చలు జరిగినట్టుగా సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు అందిన అంశంపై కవిత ఎక్స్ వేదికగా స్పం దిస్తూ, కేటీఆర్‌కు మద్దతుగా, నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.