27-05-2025 12:00:00 AM
కొండపాకలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం అన్వేషణలు
సిద్ధిపేట, మే 26: సిద్ధిపేట జిల్లా కొండపాక చరిత్ర పూర్వయుగ పురావస్తువులకు, రాష్ట్రకూట శిల్పాలకు, కాకతీయ శాసనాల కు, దేవాలయాలకు పెట్టింది పేరు. వెతుకుతున్న కొద్ది ఊటనీరులెక్క ఎన్నో చారిత్రక వస్తువులు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం నుంచి కొత్త తెలంగాణ చరిత్ర బృందం పురావస్తు పరిశోధకుడు అహోబిలం కరుణాకర్ బృందం కొండపాక పాటిగడ్డ మీద అన్వేషణ చేస్తున్నది.
వారికి గతంలో దొరికినవే కాక కొత్తగా మూడు కొత్తరాతియుగం గొడ్డండ్లు, ఒక శాతవాహన కాలంనాటి టెర్రకోటబొమ్మ వక్షబంధంతో రాచపురుషుని టార్సో (దేహభాగం) లభించాయి. గుప్పిళ్లకొద్దీ రం గు, రంగుల గాజుపూసలు, దంతపు పాచిక, కొత్తరాతియుగం గొడ్డండ్లు, రెండంచుల రాతిగొడ్డలి, టెర్రకోట బొమ్మల శఖ లాలు, ఇనుప చిట్టాలు ఎన్నో దొరికిన ప్రాంతంలోనే మళ్లీ కొత్త పురావస్తువులు దొరికాయి.
తెలంగాణ వారసత్వ శాఖ స్పందించి ఇక్కడ శాస్త్రీయ పరిశోధ నలు చేయాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కోరుతున్నాడు. విలువైన పురావస్తుసంపద చెల్లాచె దరైపోక ముందే ఈ గ్రామం మీద శ్రద్ధ చూపాలని చరిత్రబృందం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.