11 July, 2026 | 9:37 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

డిగ్రీలో క్రెడిట్స్ తగ్గింపుపై పునఃసమీక్ష

27-05-2025 12:00 AM

మండిపడుతున్న భాషాభిమానులు

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): డిగ్రీ కోర్సుల్లో భాషలు (లాంగ్వేజెస్)కు క్రెడిట్స్ తగ్గింపు నిర్ణయంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి పునఃసమీక్షిస్తున్నది. రాష్ర్టంలో డిగ్రీ కోర్సులను ప్రస్తుతం 150 క్రెడిట్లతో నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే యూజీసీ 120 క్రెడిట్లకు కుదించాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్న తవిద్యామండలి డిగ్రీలో 124 క్రెడిట్లకు ప్ర ణాళిక రూపొందించింది.

ముఖ్యంగా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ క్రెడిట్లకు భారీగా కోతపెట్టింది. గతంలో ఫస్ట్ లాంగ్వేజ్‌కు 20, సెకండ్ లాంగ్వేజ్‌కు 20 చొప్పున క్రెడిట్లు ఉండేవి. క్రెడిట్లను తగ్గించడంలో భాగంగా మొదటిభాష, రెండోభాషలకు 12 క్రెడిట్లను ప్రతిపాదించింది. అంటే ఒక్కో భాషలో 8 క్రెడిట్లు కోతపెట్టింది. ఈ ప్రతిపాదనలను తెలుగు భాషాభిమానులు తీవ్రం గా వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో క్రెడిట్ల తగ్గింపుపై మండలి అధికారులు పునరాలోచనలోపడ్డారు. అయితే ఈ క్రెడిట్లను అధికారిక సమాచారం మేరకు 12 నుంచి 16కు పెంచనున్నట్లు తెలిసింది. కానీ, భాషాభిమానులు మాత్రం 20కి పెంచాల్సిందేనని తేల్చిచెప్తున్నారు.