8 August, 2026 | 4:45 AM

సిబిఐ విచారణ నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ధర్నా

02-09-2025 09:14 PM

వలిగొండ,(విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి చిట్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ సరైంది కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, వంగాల వెంకన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి మొగుళ్ళు శ్రీనివాస్,  పడమటి మమత తదితరులు పాల్గొన్నారు.