8 August, 2026 | 5:51 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

02-09-2025 09:08 PM

వలిగొండ,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం మండలంలోని మాందాపురం గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనగ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి ఎన్ని నిర్మాణంలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా లబ్దిదారుడితో మాట్లాడుతూ  బేస్ మెంట్ లెవల్ వరకు డబ్బులు పడాయా అని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈ   ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి ఇటుక, ఇసుక కూడా ఇప్పించారని తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి లింగుస్వామి, హౌసింగ్ ఏఈ కిరణ్ ను కలెక్టర్ సన్మానించారు.