వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
శంకర్ పల్లి,(విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శంకర్ పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన రాష్ట్ర బీఆర్ఎస్వి నాయకులు లక్ష్మీ నరసింహ రెడ్డి జన్మదిన సందర్భంగా నగరంలోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన పథకాలే బాగున్నాయని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.






