calender_icon.png 18 February, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల మతాల చిచ్చుతో గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీ

17-02-2026 12:09:22 AM

అయిజ  ఫిబ్రవరి 16: అయిజ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారోత్సవ అనంతరం టి పిసిసి అధికార ప్రతినిధి షేక్షావలి టిఆర్‌ఎస్ పార్టీపై సంచలన వాక్యాలు చేశారు. షేక్షావల్లి ఆచారి మాట్లాడుతూ అయిజ మున్సిపాలిటీలో ఏ ఎజెండా లేకుండా,  ఏటువంటి హా మీలు ఇవ్వకుండా గెలిపే లక్ష్యంగా చేసుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకొన్నారని అన్నారు. కుట్రలు కుతంత్రాలతో కుల మతాల చి చ్చుతో, అధికార పీఠాన్ని దక్కించుకుందని దుయ్యబట్టారు.

మరియు ప్రజలు కూడా అధికారం లేని పార్టీలను గెలిపించుకొని అ భివృద్ధి ఎలా చేసుకుంటారని, ఇంతవరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత అ యిజ అభివృద్ధి ఏది ? అని ప్రశ్నిస్తే మేమేం చేయాలి మా చేతుల్లో ఏమీ లేదు కదా ఆంతా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది అంటూ అభివృద్ధి గూర్చి చేతులెత్తేశారు.

మరి అటువంటి పార్టీకి పట్టం కట్టి అభివృద్ధిని ఏలా చేసుకుంటారని అన్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహనతో ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టుకోవాలని, అయినా ఇది ప్రజా తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కొత్త కౌన్సిలర్లుసులోచన, మద్దిలేటి, కాంగ్రెస్ కార్యకర్తలు మైనర్ బాబు, భాష ఉన్నారు