1 July, 2026 | 7:45 PM

Breaking News

ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •  

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు

21-03-2026 04:31 PM

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల( Congress Six Guarantees) విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భారత్ రాష్ట్ర సమితి ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని కేటీఆర్ వెల్లడించారు. అభయహస్తం అనే దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తొలి సంతకం చేశారని పునరుద్ఘాటించారు. ఆరు గ్యారెంటీలపై సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయిందన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి టోపీ పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలోనూ(Governor's Speech) ఆరు గ్యారంటీలపై సంతకం జరిగిందని చెప్పించారు. కానీ ఆరు గ్యారెంటీల్లో అరగ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు(BRS Private Member Bill) ప్రవేశపెట్టనున్నామని వివరించారు. శుక్రవారం నాడు శాసనసభలో(Legislative Assembly) తాము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామన్నారు.

తాము అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Speaker Gaddam Prasad)ను కోరుతామని, కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మహిళలకు నెలకు రూ, 2500 ఇస్తామన్నారు.. పింఛను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతామన్నారు.. విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తామన్నారు.. అదీ అమలు చేయాలేదని విమర్శించారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పెట్టే బిల్లు పాస్ అయితే.. హామీలన్నీ చట్టప్రకారంగా అమలవుతాయని కేటీఆర్ వివరించారు.