1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

భైంసాలో ఘనంగా రంజాన్ వేడుకలు

21-03-2026 04:31 PM

భైంసా,(విజయక్రాంతి): భైంసా పట్టణంలో శనివారం రంజాన్ పండుగను మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని బైంసా గడ్డన్న శుద్ధ వాగు ప్రాజెక్టు వద్ద ప్రార్థన లు చేశారు. ఉదయం 9 గంటలకు పవిత్ర నమాజులు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా సాయికుమార్ ఎస్సైలు ప్రవీణ్ సాయికుమార్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మైనార్టీ నాయకులకు జిల్లా ఎస్పీ జానకి మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి స్థానిక రాజకీయ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పి జానకి షర్మిల చిన్నపిల్లలకు శుభాకాంక్షలు తెలిపి చాక్లెట్లను పంచిపెట్టారు