15 April, 2026 | 7:23 AM

రామాలయానికి విరాళం

01-02-2026 07:09 PM

-ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గోపతండ సర్పంచ్ 

మోతె,(విజయక్రాంతి): ఎన్నికల ముందు రామాలయానికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్న గోపతండ సర్పంచ్ భూక్యా భిక్కు నాయక్ ఆదివారం గ్రామ పెద్దలకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  గ్రామ అభివృద్ధికి బాటలు వేసే లక్ష్యంతో గ్రామంలో ప్రతి పనిని గ్రామ పెద్దలు మాజీ ఎంపిపి ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి, సహకారంతో ఇరు పక్షాల నాయకులతో సమన్వయంతో, సిసి రోడ్లు, డ్రైనేజీ, పనులు త్రాగు నీటి, సమస్యను పరిష్కరిస్తానని వీధి దీపాల సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కండక్టర్ వెంకన్న, ముప్పాని శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పెరుగు ఉపేందర్,  బోజ్యా, మాజీ ఎంపిటిసి గుగులోతు శ్రీరాములు, వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు  తదితరులు పాల్గొన్నారు.