calender_icon.png 11 January, 2026 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీరాలు పలికి జారుకున్న బీఆర్‌ఎస్

06-01-2026 01:31:47 AM

  1. స్పీకర్‌ను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామన్న బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు అసెంబ్లీ నుంచి జారుకున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. బీరాలు పలికిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు సభ నుంచి తోకముడిచారని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఏరియాను మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే అంశాన్ని సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ విభజన, అప్పులు, హెచ్‌ఎండీఏ రుణప్లాన్ వంటి అంశాలపై హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు సమధానంగా మాట్లాడుతూ..

బీఏసీలో నిర్ణయించిన తర్వాత నూటికి నూరు శా తం సభకు హాజరవుతామని చెప్పిన బీఆ ర్‌ఎస్ సభ్యులు.. కృ ష్ణా జలాలపై  పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై అభ్యంతరాలు ఉంటే సభలో చెప్పాలన్నారు. కానీ బయట చెప్పడం సమంజసం కాదన్నారు. స్పీకర్‌పై ఆరోపణలు చేసి అవమానకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రశ్నలు అడిగి సభకు రాకపోవడం వాళ్ల చిత్తశుద్ది బయటపడిందన్నారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని జీహెచ్‌ఎంసీని అప్పుల ఊబిలోకి నెట్టిందని, తమ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ తీసుకున్న అప్పులు, రుణాలకు సంబంధించిన వడ్డీని తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.