calender_icon.png 11 January, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతకు పెద్దపీట

06-01-2026 01:30:10 AM

  1. పేదవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రణాళికలు  
  2. మంత్రి  సీతక్క  

హైదరాబాద్, జనవరి 5(విజయక్రాంతి): మహిళా సాధికారతకు, సంక్షేమానికి ప్రభు త్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభించామన్నారు. ప్రతి మహిళా సెల్ప్‌హెల్ప్ గ్రూపులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు 15 ఏళ్లు దాటిన బాలికలు, దివ్యాంగుల మహిళల నుంచి పండు ముదుసలి వరకు మ హిళా సంఘం సభ్యులుగా చేర్చుతున్నామన్నామన్నారు.

వీరి కోసం ప్రత్యేక మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమధానామిచ్చారు. మహిళా స్వయం సహాయ బృందాలు, ఇందిరమ్మ లబ్దిదారులకు అసరగా నిలుస్తున్నాయన్నారు. ఇంది రమ్మ ఇళ్లు నిర్మించుకునే పేదలకు రుణాలు ఇవ్వడం ద్వారా సొంతింటి కలను సాకారం చేస్తున్నారని మంత్రి వివరించారు. 

రాష్ట్రం లో అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న పేదలను మహిళా సంఘాల ద్వారా గుర్తించా మని, వారిని పేదరికి నిర్మూలన సంస్థ ద్వా రా ఆర్థికంగా పైకి తీసుకొస్తామని మంత్రి సీ తక్క పేర్కొన్నారు. సంక్రాంతిలోపు ఇందిర మ్మ చీరలను ఇవ్వాలని సభ్యులు కోరగా, ఇ ప్పటికే 50 లక్షల చీరలు పంపిణి చేశామని, మిగిలిన 15 లక్షల మంది సభ్యులకు కూడా సంక్రాంతిలోపు చీరలు అందజేస్తామన్నారు.  

త్వరలో యాదగిరిగుట్టలో ఇందిరా క్యాంటిన్  

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో ఇందిరా క్యాంటిన్ ఏర్పాటు చేయాలని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రశ్నోత్తరాల సమయంలో విజ్ఞప్తి చేయగా మంత్రి సీతక్క  స్పందించారు. యాదగిరిగుట్టలో మహిళా సంఘాలు చేత క్యాంటిన్‌తో పాటు ఇతర దుకాణాలు ఏర్పా టు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు, జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు తీసుకుంటామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.