20 June, 2026 | 4:08 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

బీఆర్‌ఎస్ అంటే ‘బోగస్ రాష్ట్ర సమితి’

23-03-2026 12:00 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్నగర్, మార్చి 22: గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ పార్టీ అంటే ‘బోగస్ రాష్ట్ర సమితి‘ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 8.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని, దానికి నెలకు రూ. 50 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని డ్రగ్స్ సామ్రాజ్యంగా మార్చారని, యువత జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక, భూములను విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అట్టడుగు వర్గాలకు ప్రయోజనకరంగా ఉందని, విద్య, వైద్య రంగాలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.

మెస్ చార్జీల పెంపు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, రైతు భరోసా, రైతు బీమా వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.తప్పులు చేసి ప్రజలను అగాధంలోకి నెట్టిన బీఆర్‌ఎస్ నేతలు, ఇప్పుడు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.