20 June, 2026 | 3:15 PM

Breaking News

హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •   ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. దగా రాజ్యం: లింగాల కమల్ రాజు   •  

ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

20-06-2026 02:37 PM

కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కే రన్‌ను జిల్లా కలెక్టర్ కె. హరిత అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలసి శనివారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన 2కే రన్ కేబీ చౌక్, అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి గుండా కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.