20 June, 2026 | 3:16 PM

Breaking News

హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •   ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. దగా రాజ్యం: లింగాల కమల్ రాజు   •  

కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

20-06-2026 02:34 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): విద్యా ప్రమాణాల పెంపులో రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలిచిన పెద్దపల్లి జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో  గవర్నర్ మరియు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ విజయంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రత్యేకంగా కలిశారు.

జిల్లాకు ఈ గౌరవం దక్కేలా కృషి చేసినందుకు ఆయన కలెక్టర్‌ను అభినందిస్తూ, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలో యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ విద్యా రంగంలో జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం, మౌలిక వసతుల కల్పనలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.