'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
20-06-2026 02:55 PM
* కరణం శోభమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా అందజేత
పాపన్నపేట: మండల పరిధిలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పది పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు కరణం శోభమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా శనివారం పాఠశాలలో నగదు ప్రోత్సాహకం అందజేశారు. కరణం గోపాల్ కిషన్ రావు చేతుల మీదుగా ప్రథమ బహుమతిగా అవినాష్ కు రూ.10వేలు, ద్వితీయ బహుమతి దుర్గాప్రసాద్ కు రూ.5వేలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు కరణం అనంతరావు, స్థానిక సర్పంచ్ పద్మా జగన్నాథం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూజాత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






