20 March, 2026 | 5:06 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

బడ్జెట్ ప్రసంగం నుండి బీఆర్ఎస్ వాకౌట్ .. చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన

20-03-2026 02:10 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాకౌట్(BRS walkout) చేశారు. చెవుల్లో పూలు పెట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రతులను బీఆర్ఎస్ సభ్యులు చించేశారు. తులం బంగారం మోసం, రెండు లక్షల ఉద్యోగాలు మోసం,  బడ్జెట్ అంతా మోసం, అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎంట్రీ వద్ద నేతలు ధర్నా చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు.