03-02-2026 02:08:16 AM
మరోసారి విజయ దుందుభి మోగించాలని బీఆర్‌ఎస్..
గెలిచి పార్టీ ప్రతిష్టను నిలుపుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్...
ఇరు పార్టీలకు కత్తి మీద సాముగా మారిన మునిసిపల్ ఎన్నికలు
అలంపూర్ ,ఫిబ్రవరి 2: అలంపూర్ ని యోజకవర్గంలో ఉన్న అలంపూర్, వడ్డేపల్లి, ఐజకు సంబంధించి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రజ ల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.ఆ దిశగా ఇరు పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేశాయి.దీంతో ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు కత్తి మీద సాముగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న అలంపూర్ లో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. ఈ ప్రాంతం బీఆర్‌ఎస్ పార్టీ, ఎమ్మెల్సీ చల్లాకు కంచుకోటగా మా రిందని చెప్పొచ్చు.
అయితే ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికలపై ఆయన పెద్దగా ఫోకస్ చేయలేదని... ఇప్పుడు పార్టీ సింబల్ మీద జరిగే ఈ మునిసిపల్ ఎన్నికలను మా త్రం సీరియస్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందులో భాగంగా మూడు మున్సిపాలిటీలలో అభ్యర్థులను గెలిపించుకుని ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చల్లా యోచిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక మున్సిపల్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి తిరుగులేని శక్తిగా ఎదగాలని ప్రచార కార్యక్రమాల జోరు పెంచాలని కార్యకర్తలకు సూచించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఎమ్మెల్సీ నాయకత్వానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నాయకత్వానికి చెక్ పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలు స్తుంది.చల్లా కంచుకోటగా మారిన అల్లంపూర్ ప్రాంతంలో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని వారి నాయకత్వాన్ని చి త్తుగా ఓడించి ..కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించుకొని చైర్మన్ స్థానాలను దక్కించుకోవాల ని దిశగా కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ఆకాంక్షతో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా.. ప్రజలకు అందిస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలను అస్త్రంగా మ లుచుకు చల్లా కంచుకోటకు బీటలు బారెలా చేయాలని పక్క ప్లాన్ ముందుకు వెళ్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుంది.బలమైన నాయకత్వాన్ని బరిలో నిలిపి పీఠం దక్కించు కోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ కంటిమీద కునుకు లేకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పా ర్టీలోకి పలువురు కీలకమైన నాయకులు చేరారు దీంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరే విధంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యం గా మూడు మునిసిపల్ స్థానాలను బీసీలకు కేటాయించడంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.దీంతో పీఠం ఎవరికి దక్కేనో అన్న సందిద్ధంలో ఉత్కంఠ భరితమైనా వాతావరణంలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది.అయితే ఇరు ప్రధాన పార్టీలకు గెలుపు అంతా సులువు కాదన్నా చర్చ కూడా జరుగుతోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మరి ప్రజలు అధికార పార్టీ పట్టం కడతారా? లేకపోతే మరోసారి చల్లా నాయకత్వాన్ని బలపరుస్తారో? వేచి చూడాల్సిన పరిస్థితి ప్రజల్లో నెలకొంది.