16-06-2025 10:17:08 AM
హైదరాబాద్: ఇప్పటికీ మూడు సార్లు విచారణకు పిలిచారు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తానని కేటీఆర్(BRS Working President KTR ) అన్నారు. కేసులు పెట్టి విచారణ కమిషన్ వేసి ఇబ్బందిపెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోమని కేటీఆర్ హెచ్చరించారు. నిజం నిలకడ మీదు తెలుస్తుంది. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లొచ్చాం. అవసరమైతే అరెస్టు చేస్తారు కావచ్చని తెలిపారు. విచారణకు ఎన్నిసార్లైనా వస్తానని చెప్పా అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు ను కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చొబెట్టి పైశాచిక ఆనందం పొందారని కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ నన్ను ఏసీబీ విచారణకు పిలిచి మానసిక రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో.. కాపాడే క్రమంలో తీసుకున్న నిర్ణయాలనుంచి వెనక్కి తగ్గం అన్నారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని తెలిపారు. ఒకసారి కాదు.. వంద సార్లయినా జైలుకు వెళ్తామని కేటీఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసేవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని బీసీ వర్గాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్నారని ఆరోపించారు. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు ఇస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి చెప్పుకోవడానికి.. చేసిందేమీ లేదు.. విచారణలు, కమిషన్లంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు బీజేపీ వంత పాడుతోందన్నారు. మాలో ఒక్కరిద్దరినీ జైలులో పెట్టొచ్చు.. లక్షల మంది కేసీఆర్ సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం మీకు లేదు అని పేర్కొన్నారు. తెలంగాణకు ఆనాడు రక్షణ కోసం టీఆర్ఎస్.. ఈనాడు బీఆర్ఎస్ అన్నారు. విచారణకు వందసార్లు పిలిచినా వస్తే.. వందసార్లు నిజమే చెబుతా అన్నారు. రేవంత్ రెడ్డి.. మీకు ధైర్యం ఉంటే లైడిటెక్షర్ పరీక్షకు రా అని సవాల్ విసిరారు. వేధింపులతో సాధించేమీ లేదు.. అన్నిటికీ తెగించే కొట్లాడుతున్నామన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ జామ్ అయింది. ఏసీబీకి వెళ్తున్న కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివచ్చారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.