26 June, 2026 | 6:31 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

రేపు ఊరుమడ్లకు కేటీఆర్

07-06-2025 03:29 PM

రామలిగేశ్వర దేవాలయ మహా కుంబాభిషేకంలో ప్రత్యేక పూజలు

కేటీఆర్ రాకతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు...

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్లలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహా కుంభాభిషేకం గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నూతన దేవాలయంలో జరిగే మహా కుంభాభిషేకం, పూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొని  ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రానున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా ఆ గ్రామంలో  కార్యకర్తలు నాయకులు  భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. భక్తులు, బిఆర్ఎస్ పార్టీ, నాయకులు,అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కంచర్ల సోదరులు పేర్కొన్నారు.