బీజేపీ కార్యాలయ ముట్టడికి బీఆర్‌ఎస్వీ యత్నం
18-04-2026 01:48 AM
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి బీఆర్‌ఎస్వీ నాయకులు శుక్రవారం యత్నించారు. పలువురు బీజేపీ కార్యాలయం వైపు పరుగులు తీయడంతో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చిత్రపటాన్ని బీఆర్‌ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు.
తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలంటూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముట్టడికి యత్నించిన బీఆర్‌ఎస్వీ నేతలపైకి క్రికెట్ బ్యాట్, కర్రలు పట్టుకొని బీజేపీ కార్యకర్తలు వెళ్లినట్లుగా వినికిడి.






