29 March, 2026 | 2:36 AM

యువకుడి దారుణ హత్య

29-03-2026 01:00 AM

ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

ఆదిలాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శాంతి నగర్‌లో నివాసం ఉండే మహమ్మద్ అర్బాజ్ (26) అనే యువకుడిని అదే కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్రతో తలపై బాది హత్య చేసినట్టు తెలిసింది. డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.

వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. దాడికి పాల్పడిన ముగ్గురు అనుమానితులు రాజేష్ పవార్, రవి పవార్, గోపాల్ పవార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ వెల్లడించారు.