calender_icon.png 5 May, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి

05-05-2025 09:46:31 AM

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్(Border Security Force jawan) మృతి చెందాడు. కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద అదుపుతప్పి బెైకు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ అనే బీఎస్ఎఫ్ జవానుకు తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మద్దెల ప్రకాశ్ మృతి చెందాడు. ప్రకాశ్ జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. సెలవులపై స్వగ్రామం గంగారం మండలం(Gangaram Mandal) అందుగులగూడానికి వచ్చాడు. జవాన్ మృతితో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.