05-05-2025 09:38:02 AM
ప్రతిఒక్క జర్నలిస్ట్ ఓటర్ 15 అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం
15 ఓట్లను మూడు విభాగాలలో మూడు రంగుల బ్యాలెట్ పత్రాలు ...
ఎన్నికల అధికారి సీనియర్ పాత్రికేయులు ,సీనియర్ అడ్వకేట్ బెక్కం జనార్ధన్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రెస్ క్లబ్ ఎన్నికలలో జర్నలిస్ట్ ఓటర్లు ఓట్లు వేసే ప్రక్రియ నియమ నిబంధనలు విడుదల చేసిన ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది బెక్కం జనార్దన్ అన్నారు. ఓటర్ వెయ్యి విధానం తోపాటు పలు అంశాలను ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాలని ఈ సందర్భంగా డెక్కన్ జనార్ధన్ పలు అంశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మొత్తం 252 మంది ఓటర్ లు ప్రతి ఒక్కరు 3 విభాగాలుగా 15 మంది అభ్యర్థులకు ఓట్లు వేయాలన్నారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలలో మొత్తం పోస్టుల ప్రకారం 5 విభాగాల పోస్ట్ లకు ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ 5 విభాగాల అభ్యర్థులకు జర్నలిస్ట్ ఓటర్లు ఓట్లు వేయాలన్నారు. ఇందుకుగాను ఓటర్లు సందేహానికి గురికావద్దని పింక్, గ్రీన్ పిస్తా, వైట్ మూడు రంగులలో బ్యాలెట్ పత్రాలను ఎలక్షన్ అధికారి అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ముఖ్యంగా జర్నలిస్ట్ ఓటర్ లు పింక్ కలర్ బ్యాలెట్ పత్రంలో అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి కి ఓటు వేయాలన్నారు. అయితే ఆ బ్యాలెట్ లో ఉదాహరణ కు 5 మంది అధ్యక్ష బరిలో ఉన్న పేర్లు ఉంటే, జర్నలిస్ట్ ఓటర్ అధ్యక్షులుగా ఒక్కరికి మాత్రమే వారి పేరు ప్రక్కన స్వస్తిక్ సింబల్ మోర్ తో ఓటు వేయాలి. అలా కాకుండా ఒక జర్నలిస్ట్ ఓటర్ ఇద్దరు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వారికి క్లిక్ చేస్తే ఆ ఓటు చెల్లు బాటు కాదు. అట్లాగే అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి కీ ఓట్లు డబల్ క్లిక్ చేసిన ఆ పింక్ రంగు బ్యాలెట్ పత్రం మొత్తం ఓట్లు చెల్లు బాటు లోకి రావన్నారు. గ్రీన్ పిస్తా రంగు బ్యాలెట్ లో ముగ్గురు ఉపాధ్యక్షులకు ,ముగ్గురు జాయింట్ సెక్రెటరీ లకు జర్నలిస్ట్ ఓటర్ లు ఓట్లు వేయాలన్నారు. అయితే ఈ బ్యాలెట్ పత్రంలో ఒక్కో విభాగం లో ముగ్గురు కాకుండా అదనంగా ఒక్క ఓటు వేసిన ఆ బ్యాలెట్ పత్రం చెల్లుబాటులోకి రాదన్నారు. మూడవ రంగు బ్యాలెట్ పేపర్ లో 6 గురు ఈసి మెంబర్ లకు ఓటు వేయాలని, అలా కాకుండా ఎక్కువ మంది సభ్యులకు ఓట్లు వేస్తే ఆ వైట్ కలర్ బ్యాలెట్ ఓటు చెల్లుబాటు లోకి రాదు అని ఎన్నికల అధికారి తెలిపారు.
అంతే కాకుండా ప్రతి జర్నలిస్ట్ ఓటర్ తప్పక ఒరిజినల్ అక్రిడేషన్ కార్డు చూస్తేనే ఓటు వేయడానికి అనుమతులు ఇస్తామన్నారు, ఎవరి దగ్గరైనా అక్రిడేషన్ కార్డు పోయినట్లయితే.. వారు అక్రిడేషన్ నెంబర్ తో పాటు డి పి ఆర్ ఓ దగ్గర అట్టే స్టేషన్ చేసిన కాపీ చూపాలన్నారు. 6 వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఓటర్ లు ఓట్లు వేయడానికి అనుమతి ఇస్తామన్నారు. ఎక్కువ మంది సభ్యులు లైన్ల లో ఉంటే బయట గేట్ మూసి వేసే లైన్ లో ఉన్న వారిని ఓట్లు వేయడానికి అనుమతి ఇస్తామన్నారు. ప్రతి పానల్ నుండి ఇద్దరిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతిస్తామని ఒకరు ఏజెంట్ ఒకరు రిలీవర్ గా ఉంటారని తెలిపారు. పోలింగ్ బూత్ దగ్గర గల బూతు వద్ద 3 వైపుల ప్యానెల్ సబ్యులు 50 మీటర్ ల దూరం లో ఉండాలని సూచించారు .
2గంటల కు భోజన విరామం ఉంటుందని. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా మూడు విభాగాలుగా జరుగుతుందని.. మొదట ఈసీ మెంబర్ల కౌంటింగ్ జరుగుతుందని, తదనంతరం ఉపాధ్యక్ష జాయింట్ సెక్రెటరీల కౌంటింగ్ జరుగుతుందని, చివరగా అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం మూడు విభాగాలుగా ఇద్దరు ఇద్దరు కౌంటింగ్ పాసులు తీసుకోవాలన్నారు. ఒక అభ్యర్థి ఒక ఏజెంట్ కు అనుమతి ఇస్తామన్నారు. 4 వ తేదీ వరకు ఫోటోలతో సహా ఏజెంట్ పాసుల కోసం , కౌంటింగ్ పాసుల కోసం రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించి నమోదు చేసుకోవాలన్నారు. ఐదో తేదీన పాసులు ఇస్తామన్నారు. కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే ధ్రువపత్రాలు అందజేసి విజేతలను ప్రకటిస్తామన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్క జర్నలిస్టు ఓటరు పాటించాలని సూచించారు.