05-05-2025 01:26:52 PM
వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాలి: మంత్రి తుమ్మల
హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లోని సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) అన్నారు. వికారాబాద్ జిల్లా ధరూర్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ''రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు'' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాలు వీసీలు లేకుండా నడుస్తున్నాయని మంత్రి తుమ్మల(Tummala Nageswara Rao) పేర్కొన్నారు. కొత్తకొత్త వంగడాల వల్ల పంటల ఉత్పాదకత భారీగా పెరుగుతోందని చెప్పారు. వ్యవసాయలో మరిన్ని మార్పులు రావలని తుమ్మల ఆకాంక్షించారు. వరి సాకులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలని కోరారు. పరుగులమందులు, యూరియా వాడకం బాగా తగ్గించాలని సూచించారు. పురుగుమందులు, యూరియా వాడకం పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందన్నారు. యూరియా అధికంగా వాడి.. మనల్ని పోషించే భూతల్లిని నాశనం చేయొద్దని కోరారు.
తల్లి బాగుంటేనే పిల్లలను పోషించుకుంటుందని తెలిపారు. యూరియా అధికంగా వాడకం వల్ల పంజాబ్ ప్రజల్లో క్యాన్సర్ ముప్పు పెరిగిందని హెచ్చరించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పామ్ ఆయిల్ సాగు పెరగాలని తెలిపారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు(Oil palm cultivation)కు అనుమతి ఉందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగులో మూడేళ్లపాటు అంతర పంటలు కూడా వేసుకోవచ్చని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. గతంలో పామాయిల్ పంట ఆరేళ్లకు వచ్చేది.. ఇప్పుడు మూడేళ్లకే వస్తోందని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ సాగుతో నెలకు రెండుసార్లు జీతం వచ్చినట్లు రైతులకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదని మంత్రి తుమ్మల ఆరోపించారు. ఈ ప్రభుత్వం పంటల బీమాను మళ్లీ పునరుద్ధరించనుందని హామీ ఇచ్చారు. రైతులకు మేలు చేసే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఖజానా ఖాళీగా ఉండటం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని మంత్రి తుమ్మల వివరించారు.