05-05-2025 09:18:15 AM
హైదరాబాద్: నేటి నుంచి రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులకు(Unique Farmer ID Cards) నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్ కార్డు తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు అందుబాటులోకి రానున్నాయి. అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మట్ రిజిస్ట్రీ(Agristock Telangana Format Registry) పేరిట అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రం ఒప్పందంతో 19 రాష్ట్రాలు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. తదుపరి పీఎం కిసాన్ నిధులకు ఆదే ప్రామాణికమని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలకు సంబంధం లేదని ప్రభుత్వం సూచించింది.