calender_icon.png 5 May, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగజ్‌నగర్‌ చేరుకున్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

05-05-2025 11:20:08 AM

హైదరాబాద్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను గడ్కరీ ప్రారంభించనున్నారు. కొత్త వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, వెడ్మా బొజ్జు పాల్గొన్నారు. రూ. 3,900 కోట్ల విలువైన పనులను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం కాగజ్ నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సభా వేదికపై నుంచి 7 జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు.