05-05-2025 11:05:43 AM
సమస్యలు వినడానికి సీఎం, నేను ఎప్పుడూ సిద్ధమే
సమ్మె చేయొవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఆర్టీసీ సంఘాల నేతలు
హైదరాబాద్: ఆర్టీసీ సంఘాల నేతలు(RTC union leaders) సోమవారం నాడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను కలిశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సంఘాల నేతలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటామని వివరించారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది, సమస్యలు తగ్గతున్నాయని చెప్పారు. కోలుకుంటున్న దశలో సమ్మె చేయొవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ సిబ్బంది సమ్మె(RTC staff strike) చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కొత్తగా ఒక్క బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సీసీఎస్, పీఎఫ్ డబ్బులు వాడుకున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులకు బాండ్ మొత్తం రూ. 400 కోట్లు చెల్లించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు(RTC employees) దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్ రూ. 1039 కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ. 345 కోట్లు చెల్లించామని సూచించారు. 1500 మంది కారుణ్య నియామకాలు పూర్తి చేశామన్న పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో కొత్తగా 3,038 మంది నియామకానికి అనుమతి ఇచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.