calender_icon.png 22 September, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

22-09-2025 12:40:23 PM

మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal-Malkajgiri District) నారాపల్లిలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి జాదవ్ సాయి తేజను సీనియర్లు బలవంతంగా మద్యం తాగించడంతో పాటు బారుకు తీసుకువెళ్లి సీనియర్లు ఫుల్ గా తాగారు. అనంతరం 10 వేల రూపాయల బిల్లు కట్టాలని జాదవ్ పై ఒత్తిడి చేశారు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక నారాపల్లిలోని మధు బాయ్స్ హాస్టల్ లో తన రూమ్ లో సాయి తేజ మనస్థాపం చెంది ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీనియర్లు ర్యాగింగ్ చేయడం వల్లే సాయి ఆత్మహత్య చేసుకున్నాడని తోటి స్నేహితులు తెలిపారు.