calender_icon.png 22 September, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ పట్టణ సీఐ శివశంకర్ కు మాజీ సర్పంచ్ ఎర్నేని ఆధ్వర్యంలో అభినందనలు

22-09-2025 12:45:44 PM

నేర పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జిల్లా ఎస్పీ నర్సింహా నుండి రివార్డ్ అందుకున్న సిఐ శివశంకర్

ప్రజలకు ఉత్తమ సేవలందించి అవార్డులు రివార్డులు పొందాలి: మాజీ సర్పంచి ఎర్నేని బాబు

కోదాడ: కోదాడ సీఐ శివ శంకర్ నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా రివార్డు తీసుకోవడం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణ సీఐ కార్యాలయంలో ఇటీవల ఎస్పీ నుండి రివార్డు పొందిన సీఐ శివశంకర్ కు స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్లతో కలిసి ఘనంగా అభినందించి మాట్లాడారు. కోదాడ పట్టణంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాలని కోరారు. విధి నిర్వహణలో అంకితభావం, శాంతిభద్రతలకు నిరంతర కృషి చేస్తున్న పోలీస్ అధికారులకు ప్రజల నుండి నిత్య ఆదరణ ఉంటుందన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించి భవిష్యత్తులో సీఐ శివశంకర్ మరెన్నో అవార్డులు రివార్డులు పొందాలని ఆకాంక్షించారు. పూలమాలలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.