7 May, 2026 | 1:56 AM

ఆయుర్వేద పీజీ స్టార్‌కు బుదారపు తేజశ్రీ

07-05-2026 01:00 AM
  1. ఈమారు తెలంగాణ నుంచి ఇద్దరి ఎంపిక
  2. శిక్షణకు లక్ష గ్రాంట్ మంజూరు

హైదరాబాద్, మే 6(విజయక్రాంతి): ఆయుర్వేద విద్యా రంగంలో ప్రతిష్ఠాత్మకం గా నిర్వహించే పీజీ స్టార్ (స్కీమ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఆయుర్వేద రీసెర్చ్ ఫర్ పోస్ట్ గ్రాచ్యువేట్ స్కాలర్స్) ప్రోగ్రామ్‌కు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్ బుదారపు తేజశ్రీ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 16 వందల దరఖాస్తుల్లో కేవ లం వంద మందిని మాత్రమే ఆయుర్వేద వి భాగం ఎంపిక చేశారు. అందులో వరంగల్ నగరంలోని శివనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బుదారపు శ్రీనివాస్, శ్రీలత దంపతుల చిన్న కూతురు డాక్టర్  తేజశ్రీ ఎంపిక య్యారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో మంది దరఖాస్తు చేసుకున్న హైదరాబాద్ ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. సీసీఆర్‌ఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ స్టార్ ట్రైనింగ్ ఇన్ ఆయుర్వేద రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు ఎంపిక కావడంతో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ వారు లక్ష రూపాయల గ్రాంటును మంజూరు చేశారు. ఓరుగల్లుకు చెందిన డాక్టర్ బి. తేజశ్రీ ఎంపిక కావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.