7 May, 2026 | 1:37 AM

తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లులకు తరలించాలి

07-05-2026 01:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 6 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత తూకం వేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. బుధవారం జైపూర్ మండలం టేకుమట్ల, ఇందారం, షెట్ పల్లి, నర్సింగాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించాలని, రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలన్నారు. కొనుగోలు చేసినధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ వనజా రెడ్డి, ఏజెన్సీల నిర్వాహకులు ఉన్నారు.