12 June, 2026 | 8:22 PM

మంథని నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించనున్న బుద్దే స్వామి

12-06-2026 07:51 PM

మంథని,(విజయక్రాంతి): మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బుద్దే స్వామి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ సిసిఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న బుద్దే స్వామిని మంథని సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు మంథని సీఐగా పనిచేస్తున్న రాజును ఐజిపి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే బుద్దే స్వామి మంథని సీఐగా తన బాధ్యతలను స్వీకరించనున్నారు.