12 June, 2026 | 8:21 PM

డిప్యూటీ తహసిల్దార్‌గా మన్సూర్ అలీ

12-06-2026 07:49 PM

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం డిప్యూటీ తహసిల్దార్‌ (డీటీ) గా మన్సూర్ అలీ శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ డిప్యూటీ తహసిల్దార్‌గా విధులు నిర్వహించిన రామ్మోహన్, ఎల్లంపల్లి ప్రాజెక్టు కార్యాలయానికి డీటీగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో కోటపల్లి డిప్యూటీ తహసిల్దార్‌గా పని చేస్తున్న మన్సూర్ అలీని జన్నారానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మన్సూర్ అలీ బాధ్యతలు చేపట్టగా స్థానిక అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.