14 May, 2026 | 10:35 PM

ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి

21-06-2024 12:18 AM

మేయర్ జక్క వెంకట్‌రెడ్డి

మేడిపల్లి, జూన్ 20: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సూచించారు. గురువారం పర్వతాపూర్ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం కలిగించాలని సూచించారు.