09-12-2025 12:00:00 AM
డిప్యూటీ కమిషనర్ వసంతకు అయ్యప్ప స్వాముల వినతి
జవహర్ నగర్, డిసెంబర్ 8 ( విజయ క్రాంతి ): జవహర్ నగర్ సర్కిల్ పరిధిలోని బాలాజీ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే రోడ్డును సీసీ రోడ్డు నిర్మించాలని సోమవారం అయ్యప్ప స్వామి మాలదారులు. గ్రేటర్ హైదరాబాద్. సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ వసంతను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆలయానికి వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే 320 మీటర్ల రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు.కార్యక్రమంలో. ఆలయ కమిటీ నిత్య అన్నదాన ప్రసాద వితరణ కమిటీ సభ్యులు. అయ్యప్ప స్వామి మాలదారులు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.