పేదలపై గ్యాస్ భారం
పశ్చిమాసియా సంక్షోభాన్ని సాకుగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడం శోచనీయం. పశ్చిమాసి యా సంక్షోభం కారణంగా ధరలు పెంచాల్సిన అనివార్యత ఏర్పడిన విష యం వాస్తవమే. కానీ, దాన్ని సాకుగా చూపుతూ పదే పదే ధరలు పెంచడం సరికాదు.
వంట గ్యాస్ ధర ఇప్పటికే రూ.వెయ్యికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉజ్వల పథకం కింద ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడం సబబు కాదు. నిరుపేద మహిళలకు ఈ పథకం కింద మొదట్లో సంవత్సరానికి 12 సిలిండర్లు ఇచ్చేవారు. దాన్ని ప్రభుత్వం గతేడాది తొమ్మిదికి కుదిం చింది. ఇప్పుడు దాన్ని నాలుగుకు పరిమితం చేసింది.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న పేదలు, మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ ధరల పెంపు గుదిబండగా మారింది. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే చిన్న చిన్న హోటళ్లు మూతబడ్డాయి.చిరు వ్యాపారులు ఉపాధి కోల్పో తున్నారు. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. మిద్దె సురేష్, నాగర్ కర్నూల్






