సెట్విన్ చైర్మన్‌ను కలిసిన బుర్దిపాడ్ సర్పంచ్
05-01-2026 12:31 AM
జహీరాబాద్, జనవరి 4 : తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డిని బూర్దిపాడ్ సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం నాడు సెట్విన్ చైర్మన్ క్యాంప్ ఆఫీస్ లో గ్రామ ప్రజలతో కలిసి సర్పంచ్ మల్లిఖార్జున్ సెట్విన్ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. తమ గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఆయన గిరిధర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రాములు, నాగిరెడ్డి, వెంకట్రెడ్డి, ప్రతాప్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






