calender_icon.png 7 January, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి

05-01-2026 12:34:06 AM

ఎంపీని కోరిన పోలంపల్లి సర్పంచ్ 

చేగుంట, జనవరి 4 : గ్రామ అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావును చేగుంట మండలం పోలంపల్లి గ్రామ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి కోరారు. ఆదివారం హైదరాబాదులో మెదక్ ఎంపీ  నివాసానికి వెళ్ళి ప్రధాన సమస్యలైన పొలంపల్లి చౌరస్తా నుండి రెడ్డిపల్లి వడ్డరి కాలనీ వరకు రోడ్డు, గ్రామ రైతులకు మినీ గోదాం, ప్రజలకు ఓపెన్ జిమ్, ప్రధాన వీధుల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంపీని కోరగా వెంటనే స్పందించి త్వరలోనే మంజూరు చేయిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు దొంతిరెడ్డి ఎల్లారెడ్డి, పొలంపల్లి బిజెపి సీనియర్ నాయకులు గరిగే గణేష్ పాల్గొన్నారు.