05-01-2026 12:30:53 AM
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్
ముషీరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా పోరాట రూపాలను రూపొందించి కార్యాచరణను చేపడతామని బీసీ పొలిటికల్ ఫ్రెండ్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం చిక్కడపల్లి లోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2026- నూతన సంవత్సర క్యాలెం డర్ ను గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్న గౌడ్, జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం గౌడ క్యాలెండర్ ఆప్ దీ ఈయర్ గా సర్దార్ సర్వాయి పాపన్న పుస్తక రచయిత స్వర్గీయ కొంపెల్లి వెంకట్ గౌడ్ ను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పోలిటికల్ ప్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దురయ్య గౌడ్, బీసీ జేఏసి చైర్మన్ కోల జనార్ధన్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిని మురహరి గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం నారాయణ గౌడ్, ప్రచార కమిటి కార్యదర్శి డాక్టర్ జవ్వాజీ అంజయ్య గౌడ్,
బీసీ పోలిటికల్ ప్రంట్ కన్వీనర్ బైరు శేఖర్, సింగం నగేష్ గౌడ్, గాలి సత్యనారాయణ గౌడ, కుల హక్కుల పోరాట కమిటీ జాతీయ అధ్యక్షులు నక్క కృష్ణ గౌడ్, అయిలయ్య గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శులు పొడిశెట్టి వెంకన్న, ఈశ్వరయ్య గౌడ్, కొండూరి దత్తుగౌడ్, సుర్వి బాస్కర్ గౌడ్, నక్క శ్రీనివాస్ గౌడ్, హర్ష వర్ధన్ గౌడ్, తండ రమేష్ గౌడ్, పల్లే వెంకటేశ్ గౌడ్, పాల ఓంకర్ గౌడ్, అశోక్ గౌడ్, పాశం రవి గౌడ్, ముత్యం ముఖేష్ గౌడ్, శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.